VIDEO: వర్షాలు కురవాలని వినూత్నంగా..!

VIDEO: వర్షాలు కురవాలని వినూత్నంగా..!

కర్నూలు: ఆస్పరిలో శ్రీ జనార్ధనస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం రెండవరోజు సాంప్రదాయ కుందేలు పారువేట నిర్వహించారు. కుందేలు పరిగెత్తే దిశను బట్టి ఆ ఏడాది వర్షాలు, పంటల దిగుబడి ఉంటుందని ఇక్కడి ప్రజల ప్రబల విశ్వాసం. భక్తులు ఉత్సాహంగా పిడకల సమరం నిర్వహించారు. ఈ వినూత్న వేడుకలను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.