రైలు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి

రైలు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి

శ్రీకాకుళం: GRP రైల్వే స్టేషన్ పరిధి వెంగళరావు కాలనీ సమీపంలో గల రైల్వే ట్రాక్‌పై బుధవారం గుర్తుతెలియని మహిళ మృతి చెందినట్లు ఎస్సై M. మధుసూదన్ రావు తెలిపారు. మృతి చెందిన మహిళ వయస్సు సుమారు 50 నుంచి 55 సంవత్సరాలు ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. వివరాలకు 9247585744ను సంప్రదించాలని కోరారు.