పొదిలిలో బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం

ప్రకాశం: పొదిలి మండలం మల్లవరం గ్రామంలో యాక్సిస్ టు జస్టిస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ మేరకు సోషల్ వర్కర్ ఎం. అభిషేకత బాల్యవివాహాల వల్ల విద్య, స్వేచ్ఛ కోల్పోవడంతో పాటు ఆరోగ్య సమస్యలు వస్తాయని వివరించారు. అనంతరం బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ఉన్నవారికి, రెండేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా ఉంటుందని తెలిపారు.