VIDEO: కలెక్టరేట్ ఎదుట ఆందోళన
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేయాలని సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. కౌలు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శివాయి భూములకు యూరియా అందించాలన్నారు. గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలన్నారు. కౌలు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.