'ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలి'

VZM: విద్యాశాఖలో కీలకంగా పని చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలని స్టేట్ JAC సభ్యులు ఆరికతోట రామకృష్ణ, లెంక సంతోష్ డిమాండ్ చేశారు. ఈమేరకు వారు భోగాపురం మండలం ముంజేరులో ఎమ్మెల్యే లోకం నాగ మాధవికి గురువారం వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష ఉద్యోగులకు సకాలంలో జీతాలందక అవస్థలు పడుతున్నారని చెప్పారు.