తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీకి షాక్
తమిళనాడులో అన్నాడీఎంకేకు షాక్ తగిలింది. సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్‌తో ఎమ్మెల్యే సెంగొట్టయన్ భేటీ అయ్యారు. కొంతకాలంగా పళనిస్వామితో సెంగొట్టయన్‌కు విభేదాలు నేపథ్యంలో పార్టీ నుంచి ఎమ్మెల్యేని పళనిస్వామి సస్సెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సెంగొట్టయన్ త్వరలోనే టీవీకేలోకి చేరతారన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి.