'ఏపీని మూడు జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తున్నాం'

'ఏపీని మూడు జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తున్నాం'

AP: తిరుపతి జిల్లా జీవకోనలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పెన్షన్ల పంపిణీ చేశారు. అభివృద్ధితో పాటు సంక్షేమం అందిస్తున్నామని అన్నారు. పెన్షన్ల కోసం రూ.51 వేల కోట్ల బడ్జెట్ విడుదల చేసినట్లు తెలిపారు. ఏపీని మూడు జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. తిరుమల కొండపై ప్రక్షాళన ప్రారంభమైందని అన్నారు.