ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్యకు షాక్..!
BHNG: పంచాయతీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆలేరు MLA బీర్ల ఐలయ్యకు భారీ షాక్ తగిలింది. ఆయన సొంతూరైన సైదాపురంలో MLA ప్రధాన అనుచరులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు వంద మంది దళిత సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన పూలెపాక లావణ్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిన్న కాంగ్రెస్ పార్టీని వీడి BRSలో చేరారు.