రైతులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
SDPT: జిల్లాలో అకాల వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హైమావతి సూచించారు. బుధవారం చేర్యాల మండలంలోని తాడూరు, చిట్యాల కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా 419 కేంద్రాల్లో సేకరణ జరుగుతోందని, రాత్రి వేళల్లో ధాన్యంపై టార్పాలిన్లు కప్పాలని తెలిపారు. తేమ శాతం సరిగ్గా ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలన్నారు.