'హెల్మెట్ లేని ప్రయాణం.. మృత్యువుకు ఆహ్వానం'

'హెల్మెట్ లేని ప్రయాణం.. మృత్యువుకు ఆహ్వానం'

BPT: హెల్మెట్ లేకుండా వాహనం నడపడం ప్రాణాలకు ముప్పు అని కర్లపాలెం ఎస్సై ఎస్.రవీంద్ర హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కర్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ‘సేఫ్ డ్రైవ్’ క్యాంపెయిన్‌ను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 'శిరో రక్ష-ప్రాణ రక్ష' కార్యక్రమం ద్వారా వాహనదారులకు అవగాహన కల్పిస్తూ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని తెలిపారు.