అమ్మమ్మను రక్షించేందుకు వెళ్లి మనవరాలు మృతి

అమ్మమ్మను రక్షించేందుకు వెళ్లి మనవరాలు మృతి

మార్కాపురం జిల్లా రాయవరంలో బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనలో అమ్మమ్మను రక్షించే క్రమంలో మనవరాలు మృతిచెందిన సంగతి అందరినీ కలిచివేసింది. కనిగిరి మండలం చల్లగిరిగలకు చెందిన తమ్మిశెట్టి పిచ్చమ్మ (80), ఆమె మనవరాలు రుక్మిణి మృతి చెందారు. ప్రాణాలతో బయటపడిన రుక్మిణి అమ్మమ్మను కాపాడేందుకు మళ్లీ బస్సులోకి వెళ్లగా మంటలు వ్యాపించడంతో రుక్మిణీ కూడా ప్రాణాలు కోల్పోయింది.