మార్కండేయ మందిర పునర్నిర్మాణానికి విరాళం
JGL: మెట్‌పల్లి పట్టణంలోని శ్రీ శివ భక్త మార్కండేయ మందిరం పునర్నిర్మాణం కోసం వెంపేటకు చెందిన జక్కని గంగాధర్-పుష్ప దంపతులు రూ. 25,116 విరాళంగా అందించారు. ముంబైలో నివాసం ఉంటున్న వీరు ఆదివారం ఈ మొత్తాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేసి, శాశ్వత సభ్యులుగా నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు ద్యావనపల్లి రాజారామ్, ఆనంద్ పాల్గొన్నారు.