ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత

ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత

SRD: మనూరు మండలం నల్ల పోచమ్మ దేవస్థానం అభివృద్ధి కోసం ఆదివారం ఓ భక్తుడు రూ. 11,116 విరాళాన్ని ఆలయ కమిటీ నిర్వాహకులకు అందజేశారు. త్వరలో స్థానికంగా ఏడు వారాల జాతర ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయానికి విద్యుత్ దీపాలంకరణ కోసం జోగిపేట పట్టణానికి చెందిన సావిడి అజయ్ కుమార్ ఆదివారం విరాళాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అర్చకులు సిద్దయ్య, శేఖర్ ఉన్నారు.