VIDEO: కల్లూరు ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు మళ్లీ అస్వస్థత

KMM: కల్లూరు గిరిజన ఆశ్రమ హాస్టల్లో విద్యార్థులు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. పది రోజుల క్రితం వాంతులు, విరోచనాలతో 15 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన విషయం తెలిసిందే. మళ్లీ ఇదే పరిస్థితి తలెత్తడంతో విద్యార్థులను ఆసుపత్రిలో చేర్చారు. అధికారులు హాస్టల్‌కు వచ్చి ఘటనపై విచారణ జరిపారు. విద్యార్థుల తల్లిదందులు ఆందోళన చెందుతున్నారు.