'డీఎస్సీ కౌన్సిలింగ్ ప్రక్రియకు పూర్తి అయిన ఏర్పాట్లు'

KRNL: జిల్లా వ్యాప్తంగా 2600 మంది డీఎస్సీ అభ్యర్థుల కౌన్సిలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా విద్యాధికారి శ్యామ్యూల్ పాల్ తెలిపారు. ఆదివారం రాయలసీమ విశ్వ విద్యాలయంలోని ధృవీకరణ పత్రాల కేంద్రాన్ని పరిశీలించి విలేకరులతో మాట్లాడుతూ.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 54 బృందాలు ఏర్పాటు చేసి, 250 మంది ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై నియమించమన్నారు.