సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

WNP: జిల్లాలో సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ గిరిధర్ సూచించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ పోలీసులు, వారియర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంచేందుకు నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.