AKNU@20 ఆకారంలో వెరైటీ థీమ్స్‌లతో విషెస్
E.G: రాజమండ్రి నన్నయ విశ్వవిద్యాలయం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం 20 రకాల థీమ్స్‌లతో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అధ్యాపకులు, సిబ్బంది కన్‌వెన్షన్ సెంటర్ వద్ద AKNU@20 ఆకారంలో నిలబడి శుభాకాంక్షలు తెలిపారు. చాళుక్య ద్వారం నుంచి విద్యార్థులు కోలాటాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.