జగన్ నివాసం వద్ద ఉద్రిక్తత

జగన్ నివాసం వద్ద ఉద్రిక్తత

AP: హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో HYD లోటస్ పాండ్‌లోని ఆయన నివాసం వద్దకు చేరుకున్న వైసీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు తమపై లాఠీఛార్జ్ చేశారని వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు 'సీఎం జగన్' అంటూ నినాదాలు చేశారు.