డిమాండ్ల సాధనకై ఉపాధ్యాయుల నిరసన
JN: రాష్ట్ర TGEJAC పిలుపు మేరకు చిల్పూర్ మండలం బిబిపేట జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏ బకాయిలతో పాటు ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఔట్‌సోర్సింగ్ కార్మికుల 64 డిమాండ్ లను పరిష్కరించాలని కోరారు. దశలవారీ పోరాటంలో భాగంగా విధులకు నల్ల బ్యాడ్జీలతో హాజరయ్యారు.