హిందూ వాహిని నాయకులను అరెస్ట్

WNP: జూబ్లీహిల్స్‌లోని పాత పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని ప్రభుత్వం అక్రమంగా తొలగించిందని వనపర్తి హిందూ వాహిని జిల్లా అధ్యక్షుడు అరుణ్ గౌడ్ అన్నారు. ఇది ప్రశ్నించిన స్థానిక హిందూ వాహిని సంఘాలపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేసి వనపర్తి పోలీస్ స్టేషన్ తరలించారని తెలిపారు. వారు మాట్లాడుతూ.. ప్రజా పాలన అంటే ధర్మం కోసం పోరాడే వ్యక్తులను అరెస్టు చేయడమా అని మండిపడ్డారు.