'కేసుల్లో బాధితులకు పరిహారం అందించాలి'
NRPT: నారాయణపేట కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ వినీత్ పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు నష్ట పరిహారం త్వరగా అందించాలని చెప్పారు. ఇందులో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.