'ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలి'

'ప్రజలకు పారదర్శకంగా  సేవలు అందించాలి'

SKLM: పలాస కాశీబుగ్గ నూతన ఆర్డీవోగా ఆర్. అప్పలరాజు ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు మంగళవారం పలాసకు చెందిన ఏపీ టీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు ఆర్డీవోను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పలాస ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజలకు పారదర్శకంగా మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.