VIDEO: రోడ్డు ప్రమాదం వ్యక్తికి తీవ్ర గాయాలు
RR: చేవెళ్ల మండలం దామరగిద్ద పెట్రోల్ బంక్ వద్ద ఓ టిప్పర్, బ్రిజా కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పూడూరు మండలం కండ్లపల్లి గ్రామానికి చెందిన పటేల్ ప్రవీణ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు ఆయనను చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్చ్ 5న ప్రవీణ్ పెళ్లి సందర్బంగా పని నిమిత్తం చేవెళ్లకు వచ్చినట్లు సమాచారం.