విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి

విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి

VKB: పరిగి మండలం బసిరెడ్డిపల్లి గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఓ ఎద్దు మృతి చెందింది. శుక్రవారం ఉదయం మేత మేస్తున్న ఎద్దు ట్రాన్‌ఫార్మర్‌కు తగలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు బాధితుడు రోషన్ తెలిపారు. సుమారు రూ.80 వేలు విలువ చేసే తన ఎద్దు మృతి చెందడంతో రోషన్ కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆయన కోరారు.