వంజీవాక కాలనీలో వరద ముప్పు
TPT: కోట మండలం వంజివాక గ్రామంలోని ఎస్సీ కాలనీ వరద ముప్పును ఎదుర్కొంటోంది. కాలనీలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరతోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు కుటుంబాలు తమ ఇళ్లలోని సామాను ఎత్తి పెట్టుకొని రాత్రిళ్లు నిద్రలేకుండా గడుపుతున్నాయి. గ్రామంలో సరైన డ్రెనేజీ వ్యవస్థ లేదు. దీంతో దళితవాడ చెరువులా మారింది. అధికారులు వెంటనే స్పందించాలని తెలిపారు.