ఏప్రిల్ 6న ఇంటర్ ఫలితాలు..!
TG: ఇంటర్మీడియట్ 2026 ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల నిరీక్షణ త్వరలోనే ముగియనుంది. ఈ మేరకు ఏప్రిల్ రెండో వారంలోపు ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 15 నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం మొదలైన విషయం తెలిసిందే. దీంతో ఏప్రిల్ 6న ఫలితాలను ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ ఆలస్యమైతే ఏప్రిల్ 10 లోపు విడుదల చేసే అవకాశం ఉంది.