VIDEO: పది పరీక్షలు.. ట్రెండింగ్‌లోకి 90's సీన్

VIDEO: పది పరీక్షలు.. ట్రెండింగ్‌లోకి 90's సీన్

TG: రేపటి నుంచి పది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 90's వెబ్ సిరీస్‌లోని ఓ సీన్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. 'ఈ రోజుతో మీ స్కూల్‌కే కాదు.. మీ బాల్యానికే చివరి రోజు. అందుకే ఎవరికైనా సారీ చెప్పాలనుకుంటే చెప్పండి. మళ్లీ ఈ ఫ్రెండ్స్ కలుస్తారో లేదో. కొన్నిసార్లు వాళ్ల పేర్లు కూడా గుర్తురావు' అంటూ విద్యార్థులకు టీచర్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.