పోలీస్ కిష్టయ్య వర్ధంతిని అధికారికంగా జరపాలి: కిషన్
MLG: తెలంగాణ ఉద్యమం కోసం 2009 డిసెంబర్ 1న కామారెడ్డిలో తుపాకీతో కాల్చుకొని బలవన్మరణం చెందిన పోలీస్ కిష్టయ్య వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, MLG మెపా జిల్లా అధ్యక్షుడు అచ్చునూరి కిషన్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఆయన బలిదానం తర్వాత ఉద్యమం మరింత ఉవ్వెత్తున ఎగిసిపడిందని, కిష్టయ్య స్ఫూర్తితో అనేకులు పోరాటంలో చేరారని గుర్తుచేశారు.