టైలర్ సంక్షేమానికి కృషి చేస్తా

ELR: టైలర్స్ సంక్షేమానికి అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఏపీ రాష్ట్ర టైలర్స్ అభివృద్ధి సహకార సమాఖ్య ఛైర్మన్ ఆకాశపు స్వామి అన్నారు. రాష్ట్ర మాజీ ఆప్కో డైరెక్టర్ దొంతంశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం ఉంగుటూరులో ఘన సన్మానం చేశారు. టైలర్ సంఘం నాయకులు ముప్పన సత్యనారాయణ, సారిక చల్లారావు, రంగు శేషారావు, తదితరులు పాల్గొన్నారు.