ఛలో న్యూఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి

ఛలో న్యూఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి

MBNR: నవంబర్ 8వ తేదీన గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించబోయే నిరసన కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను మాజీ మంత్రి డాక్టర్ వీ. శ్రీనివాస్ గౌడ్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ నాయక్ మాట్లాడుతూ.. గిరిజన లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే కుట్రలను ఖండిస్తున్నామన్నారు.