VIDEO: జిల్లాకు సీఎం హామీ ఇవ్వకపోవడం దారుణం: సీపీఐ

ATP: సీఎం చంద్రబాబు ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి పథకాలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పకపోవడం దుర్మార్గమని సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి ప్రశ్నించారు. రాయదుర్గం పట్టణంలో శుక్రవారం సీపీఐ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 10న నిర్వహించిన 'సూపర్ సిక్స్ సూపర్ హిట్' కార్యక్రమంలో జిల్లాకు ఏ ఒక్క హామీ ఇవ్వకపోవడం దారుణమన్నారు.