కాంగ్రెస్‌పై ఆర్ కృష్ణయ్య ఫైర్

TG: దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టేందుకు మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై మాట్లాడిన రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కులగణన చేపట్టాలని బీసీ సంఘాల నేతలుగా తాము ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నామని చెప్పారు. 2010లో కులగణన చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి, తూతూ మంత్రంగా సర్వే చేసి వదిలిపెట్టారని తెలిపారు.