'ఈ నెల 10వ తేదీ నుంచి సెమిస్టర్ పరీక్షలు'
HNK: ఆర్ట్స్& సైన్స్ డిగ్రీ కళాశాలలో ఈనెల 10 నుంచి 2,4, 6వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ జ్యోతి తెలిపారు. ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు రోజుకు రెండు విడతలుగా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు సమయాని కంటే ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని, హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని పేర్కొన్నారు.