బాల్య వివాహాలను నిరోధించడం మతపెద్దల బాధ్యత: సీపీ
NZB: బాల్యవివాహాలను నిరోధించడం మతపెద్దల బాధ్యత అని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. NZB జిల్లా కేంద్రంలోని మహిళా శిశు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గంగాస్థాన్ ఫేస్-2లో ఉన్న రామకృష్ణ మఠంలో శనివారం బాల్య వివాహాల విముక్తి గురించి మతపెద్దలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.