రామ్ తీర్థ్‌లో పశువులకు ముందస్తు టీకాలు

సంగారెడ్డి: కంగ్టి మండలం రామతీర్థంలో పశువుల చికిత్స శిబిరాన్ని మంగళవారం ఉదయం ఏర్పాటు చేశారు. మండల పశు వైద్యాధికారి డాక్టర్ సయ్యద్ ముస్తాక్ పశువులకు గుండె జబ్బు వ్యాధి రాకుండా టీకాలను వేశారు. దాదాపు 150 పశువులకు టీకాలు వేసినట్టు వైద్యాధికారి చెప్పారు. అదేవిధంగా సాధారణ వైద్య చికిత్సలు కూడా చేపట్టి మందులు, మాత్రలు పంపిణీ చేశారు.