మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే నల్లమిల్లి

W.G: రాజమహేంద్రవరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో బీజేపీ నేత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువాకప్పి, పుష్పగుచ్చం అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత సోమ్ వీర్రాజు కంటిపూడి సర్వరాయుడు తదితరులు పాల్గొన్నారు.