రామగుండం అభివృద్ధికి సింగరేణి సహకారం కోరిన మేయర్

రామగుండం అభివృద్ధికి సింగరేణి సహకారం కోరిన మేయర్

PDPL: నగర అభివృద్ధికి సహకరించాలని సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ద ప్రకాష్‌ను మేయర్ మహంకాళి స్వామి కోరారు. హైదరాబాద్‌లోని కార్యాలయంలో కలసి పూలమొక్క అందజేశారు. సింగరేణి ప్రభావిత ప్రాంతం ఎక్కువగా ఉండటంతో సీఎస్‌ఆర్ కింద నగర అభివృద్ధి, స్వచ్ఛ నగరం లక్ష్యానికి తోడ్పాటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఎండీ సానుకూలంగా స్పందించినట్లు మేయర్ తెలిపారు.