చిన్నారికి నామకరణం చేసిన ఎంపీ పురందేశ్వరి
E.G: రాష్ట్ర క్రియేటివిటీ, కల్చర్ కమీషన్ ఛైర్మన్ పొడపాటి తేజస్వి - రామ్ దంపతులని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయవాడ హయత్ హోటల్లో జరిగిన వారి పిల్లల నామకరణం, అన్నప్రాసన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం చిన్నారులను దీవించి చిన్నారులకు నామకరణం చేసి ఆశీర్వదించారు.