మహిళా పోలీస్ తొలి సదస్సును ప్రారంభించిన మంత్రి సీతక్క

HYD: హైదరాబాద్ లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో తెలంగాణ మహిళా పోలీస్ తొలి సదస్సు కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క హాజరై తెలంగాణ మహిళా పోలీస్ తొలి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా పోలీసుల నుంచి మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. పోలీసు ఉన్నత అధికారులు, మహిళా పోలీస్ అధికారులు సదస్సుకు హాజరయ్యారు.