అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీజేపీ
2026 అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. గోవాలోని పోండా నుంచి రితేష్ రవి నాయక్, నాగాలాండ్‌లోని కోరిడంగ్ నుంచి దావోచియర్ ఇమ్చెన్ పోటీ చేయనున్నారు. కర్ణాటకలోని బాగల్‌కోట్ నుంచి వీరభద్రయ్య, దావణగెరె సౌత్ నుంచి శ్రీనివాస్ దాసకారియప్ప పేర్లను ఖరారు చేశారు. త్రిపురలోని ధర్మనగర్ నుంచి జహర్ చక్రవర్తి బరిలోకి దిగుతున్నారు.