VIDEO: సోంపేటలో మెగా అభిమానులు సందడి

SKLM: రామ్ ఛరణ్ హీరోగా తెరకెక్కిన 'గేమ్ ఛేంజర్' సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా సోంపేట పట్టణం శ్రీనివాస థియేటర్ వద్ద మెగా ఫ్యామిలీ అభిమానులు మందు గుండా సామాన్లు కాలుస్తూ, తీన్మార్ దరువులతో సందడి చేశారు. అభిమానులు సందడితో సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చినట్టుంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.