మంజీరాలో పెరిగిన వరద ప్రవాహం

NZB: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొతంగల్ మండల పరిధిలో మంజీరాలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో నదీ పరిసర ప్రాంతాలు జలకళతో కొత్త శోభను సంతరించుకున్నాయి. ప్రకృతి అందాలు, పచ్చని పరిసరాలతో ఆహ్లాదకరంగా మారింది. నదిలో పెరిగిన వరద నీటిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు సూచించారు.