నిరుద్యోగులకు గొప్ప అవకాశం

నిరుద్యోగులకు గొప్ప అవకాశం

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 13న హనుమకొండలోని ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం.మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని అపోలో ఫార్మసీ కంపెనీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ఉందని, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.