'తిరుపతిలో ప్రైవేట్ ఆస్పత్రికి బ్లాక్ మెయిలింగ్'
తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆదివారం నలుగురు వ్యక్తులు తమను హ్యూమన్ రైట్స్ సభ్యులమని చెప్పుకుంటూ హల్‌చల్ చేశారు. స్థానికుల వివరాలు.. ఆస్పత్రికి సంబంధించిన వీడియోలు తమ వద్ద ఉన్నాయని పేర్కొంటూ MDని కలవాలని కోరారు. మాట్లాడేందుకు వచ్చిన డాక్టర్‌పై దాడి చేసి, రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే వీడియోలను SMలో పెట్టేస్తామని బెదిరించినట్లు సమాచారం.