ఈనెల 19, 20 తేదీల్లో జోనల్ స్థాయి క్రీడా పోటీలు

SKLM: ఈనెల 19, 20 తేదీల్లో విశాఖలోని జోనల్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె. శ్రీధర్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికైన వారికి ఇప్పటికే సమాచారం అందించామన్నారు. వారందరూ శ్రీకాకుళం కోడి రామమూర్తి మున్సిపల్ స్టేడియంకు ఈనెల 19న ఉదయం 5 గంటలకు హాజరు కావాలన్నారు. పూర్తి సమాచారానికి 98850 96734 నంబర్‌ను సంప్రదించాలన్నారు.