నియోజకవర్గాల పునర్విభజన అంశంతో వేడెక్కిన రాజకీయం

నియోజకవర్గాల పునర్విభజన అంశంతో  వేడెక్కిన రాజకీయం

KNR: నియోజకవర్గాల పునర్విభజన అంశం పార్లమెంటులో చర్చకు రావడం కరీంనగర్ జిల్లా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సరిహద్దులు మారిపోవడం ఖాయం. దశాబ్దాలుగా ఒకే నియోజకవర్గంలో పట్టు సాధించిన నాయకులకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. మరోవైపు కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే తమ సామాజిక సమీకరణాలు కలిసొస్తాయని మరికొందరు నాయకులు చర్చించుకుంటున్నారు.