'మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ లక్ష్యం'
NLG: మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా మంత్రి సీతక్క, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇవాళ చిట్యాలలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామన్నామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ లక్ష్యం అని పేర్కొన్నారు.