10th విద్యార్థులకు ఆల్ ది బెస్ట్: ఎమ్మెల్యే
TPT: నేటి నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షల సందర్భంగా సత్యవేడు నియోజకవర్గ విద్యార్థులకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆల్ ది బెస్ట్ తెలిపారు. సరస్వతి మాత కటాక్షంతో అందరూ ఏకాగ్రతతో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. మంచి మార్కులు సాధించి ఉన్నత చదువులకు పునాది వేయాలని విద్యార్థులకు సూచించారు.