'పులివెందులలో ప్రైవేటీకరణకు నిరసనగా 12న ర్యాలీ'
KDP: వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 12వ తేదీన పులివెందుల పాత MLA ఆఫీస్ నుంచి మినీ సెక్రటేరియట్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని కడప MP వైఎస్ అవినాష్ రెడ్డి ఆదివారం వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రజల వైద్య విద్యా హక్కును కాపాడటమే ఈ ర్యాలీ లక్ష్యమని, ప్రభుత్వం వైద్య విద్యను వ్యాపారంగా మార్చే ప్రయత్నాలు చేస్తోందన్నారు. అనంతరం ప్రజలంతా ఈ ర్యాలీలో పాల్గొనాలని ఆయన కోరారు.