రూ.28 లక్షలతో నిర్మించిన తాగునీటి పథకం వృధా

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలం శీలంవారిపల్లిలో తాగునీటి పథకం నిరుపయోగంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రూ.28 లక్షలతో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి, డీప్ బోర్ వేశారు. దీని ద్వారా గతంలో గ్రామస్తులకు తాగునీరు అందేది. బోరులో నీరు లేదనే కారణం చూపుతూ అధికారులు ఈ పథకాన్ని పట్టించుకోవడం మానేశారు. దీంతో గ్రామస్తులకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి.